కదిలించిన ఆంధ్రజ్యోతి కథనం

ABN , First Publish Date - 2021-05-18T06:24:16+05:30 IST

అనంతపురం సర్వజనాస్పత్రిలో కరోనా బాధితులు, రోగులు పడుతున్న కష్టాలపై ఆంధ్రజ్యోతి వరుసగా ప్రచరిస్తున్న కథనాలు మానవతావాదులను కదిలించాయి. ఈ నేపథ్యంలో ఐఎంఏ సాయంతో ఆస్పత్రిలో రోగుల బాధలు తీర్చేందుకు ముందుకొచ్చారు.

కదిలించిన ఆంధ్రజ్యోతి కథనం

ఐఎంఏ సాయంతో ఆస్పత్రిలో 50 పడకలు ..

ప్రారంభించిన ఎమ్మెల్యే 

 రూ. లక్ష విరాళం

అనంతపురం వైద్యం, మే17: అనంతపురం సర్వజనాస్పత్రిలో కరోనా బాధితులు, రోగులు పడుతున్న కష్టాలపై ఆంధ్రజ్యోతి వరుసగా ప్రచరిస్తున్న కథనాలు మానవతావాదులను కదిలించాయి. ఈ నేపథ్యంలో ఐఎంఏ సాయంతో ఆస్పత్రిలో రోగుల బాధలు తీర్చేందుకు ముందుకొచ్చారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌, ఆలంభన స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు జనార్దన, గిల్డాఫ్‌ సర్వీస్‌ స్కూల్‌ పూర్య విద్యార్థులు సంయుక్తంగా ఆస్పత్రిలో ప్రత్యేకంగా 50 పడకలు అన్ని వసతులతో ఏర్పాటు చేశారు. ప్రతి పడకకు ఆక్సిజన కాన్సంట్రేటర్‌, సిలిండర్‌ ఉండేలా చర్యలు తీసుకున్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చేతుల మీదుగా ఈ దాతల ట్రయేజ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కేంద్రం నడపడానికి ఎమ్మెల్యే తనవంతు సాయంగా రూ.లక్ష విరాళం ఇచ్చారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డా క్టర్‌ ఎండ్లూరి ప్రభాకర్‌, కార్యదర్శి డాక్టర్‌ భానుమూర్తి, కోశాధికారి డాక్టర్‌ హేమలత, డాక్టర్‌ ప్రసాద్‌, ఆలంభన జనార్దన, గిల్డాఫ్‌ సర్వీస్‌ పూర్వ విద్యార్థులు చవ్వారాజశేఖర్‌రెడ్డి, గీతాబాల, రమేష్‌, రోటరీ క్లబ్‌ సుధీర్‌, సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓ విజయలక్ష్మి, నవీద్‌ అహ్మద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T06:24:16+05:30 IST