ఇది మహా మాంద్యమే: ఐఎంఎఫ్‌

ABN , First Publish Date - 2020-04-10T07:00:54+05:30 IST

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గత నెలలోనే మహా మాంద్యంలోకి జారుకుందనడానికి మరిన్ని ఆధారాలు అందుబాటులోకి వచ్చాయని అంతర్జాతీయ ద్రవ్య ..

ఇది మహా మాంద్యమే: ఐఎంఎఫ్‌

  • 1930 తర్వాత అతిపెద్ద ఆర్థిక సంక్షోభం

వాషింగ్టన్‌: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గత నెలలోనే మహా మాంద్యంలోకి జారుకుందనడానికి మరిన్ని ఆధారాలు అందుబాటులోకి వచ్చాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది. 1930 నాటి మహా మాంద్యం తర్వాత ఇదే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం కానుందని ఐఎంఎఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జివా అన్నారు. ఈ ఏడాది 170కి పైగా దేశాల తలసరి ఆదాయ వృద్ధి రుణాత్మక స్థాయికి క్షీణించనుందన్నారు. 1929లో అమెరికాలో ప్రారంభమైన ఆర్థిక సంక్షోభం ప్రపంచదేశాలన్నింటికీ విస్తరించి, దశాబ్దకాలం పాటు కొనసాగింది. 

Updated Date - 2020-04-10T07:00:54+05:30 IST