IMD yellow alert : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు...ఎల్లోఅలర్ట్ జారీ

ABN , First Publish Date - 2022-08-27T13:02:13+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 30వతేదీ వరకు భారీ నుంచి అతి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ)(IMD)...

IMD yellow alert : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు...ఎల్లోఅలర్ట్ జారీ

న్యూఢిల్లీ:దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 30వతేదీ వరకు భారీ నుంచి అతి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ)(IMD) శనివారం వెల్లడించింది.ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో(Odisha, Uttarakhand) అతి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఐఎండీ అధికారులు శనివారం ఆయా రాష్ట్రాల్లో ఎల్లో అలర్ట్(yellow alert) జారీ చేశారు.ఒడిశా రాష్ట్రంలోని మహానది, సురనరేఖ నదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తున్నాయి.ఒడిశాలో శనివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశా రాష్ట్రంలోని మయూర్‌భంజ్, బాలాసోర్, ఖుర్దా, రాయగడ,కోరాపుట్, మల్కన్‌గిరి, గంజాం, అంగుల్,కియోంఝర్, కటక్, జాజ్‌పూర్, బాలాసోర్, భద్రక్, బౌధ్, నయాగర్, నబరంగ్‌పూర్, గజపతి,ధేన్‌కనగల్‌ జిల్లాల్లో శనివారం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించించింది. 


భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.కలహండి, నబరంగ్‌పూర్, కోరాపుట్, మల్కన్‌గిరి  గజపతి, రాయగడ జిల్లాల్లో కూడా శనివారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో ఈ నెల 30వతేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయి. యూపీలో నదుల నీటిమట్టం పెరగడంతో(flood like situation) 18 జిల్లాల్లోని 650 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ  శని,ఆదివారాల్లో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో నాలుగురోజులపాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు(severe rainfall) కురిసే అవకాశం ఉంది. భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(National Disaster Response Force) అప్రమత్తమైంది.


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి పడుతున్నాయి.రాజస్థాన్‌లో ఈ వారం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోట, ఝలావర్, బుండి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కోట డివిజన్‌లో కురిసిన భారీ వర్షాలతో నదుల్లో వరద నీటి ప్రవాహం పెరిగింది.దీంతో డ్యామ్‌ల గేట్లు తెరవడంతో పలుచోట్ల వరదలు వెల్లువెత్తాయి.


తెలంగాణ(Telangana), కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు(heavy rains) కురుస్తాయని ఐఎండీ అధికారులు విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో తెలిపారు.అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర  రాష్ట్రాల్లో రెండురోజులపాటు భారీవర్షాలు కురుస్తాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో సోమవారం వరకు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు.

 

Updated Date - 2022-08-27T13:02:13+05:30 IST