ఎండలు 50 డిగ్రీ సెల్సియస్ దాటొచ్చు.. IMD హెచ్చరిక

ABN , First Publish Date - 2022-04-30T22:54:28+05:30 IST

న్యూఢిల్లీ : తీవ్రమైన వేసవితాపంతో జనాలు అల్లాడిపోతున్న వేళ Indian Meteorological Department (ఐఎండీ) చెమటలు పట్టించే హెచ్చరిక చేసింది.

ఎండలు 50 డిగ్రీ సెల్సియస్ దాటొచ్చు.. IMD హెచ్చరిక

న్యూఢిల్లీ : తీవ్రమైన వేసవితాపంతో జనాలు అల్లాడిపోతున్న వేళ  Indian Meteorological Department (ఐఎండీ) చెమటలు పట్టించే హెచ్చరిక చేసింది. ఈ ఏడాది summerలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎండల తీవ్రత మే 2 వరకూ ఇదేవిధంగా కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా మే నెలలో ఎండలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ ఏడాది మే నెలలో పశ్చిమ రాజస్థాన్‌లోని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 50 డిగ్రీ సెల్సియస్ దాటేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో నమోదయిన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఈ ఏడాది ఏప్రిల్ 4వ స్థానంలో నిలిచిందని భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం మహాపాత్ర చెప్పారు. 


పశ్చిమ- మధ్య భారతం, వాయువ్య ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదుతాయని మహాపాత్ర హెచ్చరించారు. ఈశాన్య భారతంలోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తాయని చెప్పారు. కాగా గత 122 ఏళ్లలో వాయువ్య, మధ్య భారతంలో ఏప్రిల్ నెల సగటు ఉష్ణోగ్రతలు 35.90 డిగ్రీ సెల్సియస్, 37.78 డిగ్రీ సెల్సియస్ చొప్పున ఉన్నాయని గుర్తుచేశారు. కాగా దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత 1956లో రాజస్థాన్‌లో 52.6 డిగ్రీ సెల్సియస్ నమోదయిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-30T22:54:28+05:30 IST