heavy rains: దేశంలో నేడు భారీవర్షాలు...ఐఎండీ హెచ్చరిక

ABN , First Publish Date - 2021-07-12T13:08:47+05:30 IST

ఉత్తర భారతదేశంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది...

heavy rains: దేశంలో నేడు భారీవర్షాలు...ఐఎండీ హెచ్చరిక

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఉత్తరాఖండ్, పంజాబ్, చండీఘడ్, హర్యానా, ఢిల్లీ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీఘడ్, మధ్యమహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, కర్ణాటక,కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన వెదర్ బులెటిన్ లో తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, తెలంగాణ, చండీఘడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు భారీవర్షం కురుస్తుంది.


భారీవర్షాల సందర్భంగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని ఐఎండీ అధికారులు చెప్పారు.జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్, తూర్పు రాజస్థాన్, సిక్కిం, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవులు, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, పశ్చిమ మధ్యప్రదేశ్, బీహార్, లక్షద్వీప్ లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తన బులెటిన్ లో పేర్కొంది.సోమవారం ఉదయం, జమ్మూ అండ్ కశ్మీర్, లడఖ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, సిక్కిం, అస్సాం, పుదుచ్చేరి, నాగాలాండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, కోస్తా ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, రాజస్థాన్ మొదలైన ప్రాంతాల్లో పిడుగులు పడవచ్చిని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.


Updated Date - 2021-07-12T13:08:47+05:30 IST