Mumbai: వచ్చే రెండు రోజుల పాటు భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-09-13T17:59:49+05:30 IST

మహారాష్ట్రలోని ముంబై సబర్బన్ జిల్లాల్లో రాగల రెండు రోజుల్లో భారీవర్షాలు కురుస్తాయని ముంబై వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు....

Mumbai: వచ్చే రెండు రోజుల పాటు భారీవర్షాలు

ముంబై : మహారాష్ట్రలోని ముంబై సబర్బన్ జిల్లాల్లో రాగల రెండు రోజుల్లో భారీవర్షాలు కురుస్తాయని ముంబై వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముంబై, రాయగడ్, రత్నగిరి, సింధూర్గ్, నాసిక్, పూణే, సతారా, కొల్హాపూర్ జిల్లాల్లో వచ్చే రెండు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు.సోమవారం ముంబై సబర్బన్ జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. దక్షిణ ముంబైలో గత 24 గంటల్లో 20 నుంచి 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. 


థానే, నవీ ముంబై ప్రాంతాల్లో 40 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.రాగల 48 గంటల్లో ముంబై సబర్బన్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం అధికారులు హెచ్చరించారు. అల్పపీడన ప్రభావం వల్ల ముంబైలో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. భారీవర్షాల వల్ల ముంబై సబర్బన్ ప్రాంతాల్లో వరదలు వెల్లువెత్తే అవకాశాలున్నాయి.

Updated Date - 2021-09-13T17:59:49+05:30 IST