IMD warning: నేటి నుంచి వారంరోజులపాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-08-31T17:54:01+05:30 IST

దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది....

IMD warning: నేటి నుంచి వారంరోజులపాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు

న్యూఢిల్లీ : దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో వారంరోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. సెంట్రల్ మహారాష్ట్ర, కొంకణ్ అండ్ గోవాలలో భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, విదర్భ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, గుజరాత్, మరఠ్వాడ, తెలంగాణ రాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజా వెదర్ బులెటిన్ లో పేర్కొంది.


 సెప్టెంబరు 1వతేదీన గుజరాత్, కొంకణ్, గోవా, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర,మిజోరం, సెంట్రల్ మహారాష్ట్రలలో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో వివరించింది. సెప్టెంబరు 2వతేదీన గుజరాత్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. సెప్టెంబరు 3వతేదీన ఒడిశా, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి,కరైకల్ ప్రాంతాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. 


Updated Date - 2021-08-31T17:54:01+05:30 IST