న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో గురువారం ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. భారీవర్షాల వల్ల ఢిల్లీలో గురువారం లోతట్టుప్రాంతాలు జలమయం అవుతాయని, దీనివల్ల ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లనుంది.భారతవాతావరణ శాఖ గురువారం ఢిల్లీలో ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. సఫ్దర్ జంగ్ అబ్జర్వేటరీ వద్ద బుధవారం 4.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాలం, లోడి రోడ్డు, రిడ్జ్, అయానగర్ లలో భారీవర్షం కురిసింది. ఢిల్లీ నగరంలో 386.3 మిల్లీమీటరల్ వర్షం కురిసింది. భారీవర్షాల వల్ల ఢిల్లీ రోడ్లపై డ్రైనేజీ నిండి పొంగి ప్రవహిస్తోంది. భారీవర్షాల వల్ల ఢిల్లీలో విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది.