ముంబైలో నేడు భారీవర్షాలు..పాల్ఘార్‌లో భూప్రకంపనలు

ABN , First Publish Date - 2020-09-22T13:06:42+05:30 IST

ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని....

ముంబైలో నేడు భారీవర్షాలు..పాల్ఘార్‌లో భూప్రకంపనలు

ముంబై (మహారాష్ట్ర): ముంబై నగరంతోపాటు పలు పరిసర నగరాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ముంబైలోని కేంద్ర వాతావరణ కేంద్రం అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.ముంబై, థానే, రాయగడ్, పూణే, సతార, సిందూర్గ్ ప్రాంతాల్లో మంగళవారం ఉరుముులు, మెరుపులతో కూడిన భారీవర్షాలు కురుస్తాయని ముంబై వాతావరణ కేంద్రం డిప్యూటీ డైరెక్టరు కేఎస్ హోలికర్ చెప్పారు. ముంబై, థానే నగరాల్లో భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.



పాల్ఘార్‌లో భూప్రకంపనలు

మహారాష్ట్రలోని పాల్ఘార్ లో మంగళవారం ఉదయం భూమి కంపించింది. పాల్ఘార్ లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. ముంబై నగరానికి 104 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘార్ లో మంగళవారం తెల్లవారుజామున 2.50 గంటలకు భూమి కంపించింది. భూప్రకంపనలతో నిద్రలో ఉన్న ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు.


 భారీవర్షాల నేపథ్యంలో సర్కారు ముంబై, థానే నగరాల్లో ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు, నాలుగు గంటల్లో పాల్ఘార్, ముంబై, థానే, రాయగడ్, పూణే, అహ్మద్ నగర్, జలగాం, ధూలే, సతారా, సాంగ్లీ, షోలాపూర్, బీడ్, ఔరంగగాబాద్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు కోరారు.

Updated Date - 2020-09-22T13:06:42+05:30 IST