Weather Report: వచ్చే రెండు,మూడు రోజుల్లో భారీవర్షాలు...ఐఎండీ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-09-22T17:18:48+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో వచ్చే రెండు,మూడు రోజుల్లో భారీవర్షాలు(heavy rainfall)కురుస్తాయని...

Weather Report: వచ్చే రెండు,మూడు రోజుల్లో భారీవర్షాలు...ఐఎండీ హెచ్చరిక

న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో వచ్చే రెండు,మూడు రోజుల్లో భారీవర్షాలు(heavy rainfall)కురుస్తాయని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) (ఐఎండీ) గురువారం వెల్లడించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, విదర్భ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ ప్రాంతాల్లో వచ్చే రెండు మూడు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజాగా విడుదల చేసిన వెదర్ బులెటిన్(Weather Report) లో పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు తూర్పు,ఈశాన్య ప్రాంతాల్లోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు(IMD issues) చెప్పారు. 


అసోం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.మధ్యప్రదేశ్, హర్యానా, చంఢీఘడ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు చెప్పారు. 


Updated Date - 2022-09-22T17:18:48+05:30 IST