కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-04-16T06:40:08+05:30 IST

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

 - రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ లవకుమార్‌రెడ్డి

జనగామ కల్చరల్‌, ఏప్రిల్‌ 15 : ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ డి.లవకుమార్‌రెడ్డి కోరారు. గురువారం జనగామ జిల్లా కేంద్రంలోని విజయ హాస్పిటల్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఐఎంఏ, లయన్స్‌ క్లబ్‌, రెడ్‌క్రాస్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘సెకండ్‌ వేవ్‌ కరోనాపై అవగాహన సదస్సు’కు ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు జి.గోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించగా, ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కరోనా ప్రస్తుతం జన్యు రూపాంతరం చెంది అన్ని వయస్సుల వారికి త్వరగా వ్యాపిస్తోందన్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం చేయాలన్నారు. విధిగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ కన్న పరశురాములు మాట్లాడుతూ రీచ్‌ ఇండియా ఫార్మాస్యూటికల్‌ సంస్థ ద్వారా రూ.6.40 లక్షల విలువ గల విటమిన్‌-డి లిక్విడ్‌ డోసులు వితరణ చేసినట్లు తెలిపారు. ఈ సదస్సులో రెడ్‌క్రాస్‌ స్టేట్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ సీహెచ్‌.రాజమౌళి, తానా అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మీనారాయణనాయక్‌, డీపీఆర్‌ఓ గౌస్‌, ఏపీఆర్‌ఓ ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:40:08+05:30 IST