Abn logo
Dec 5 2020 @ 05:16AM

బాలీవుడ్‌లో మహిళలకు పవర్‌ఫుల్ రోల్స్ వస్తున్నాయి: మహీ గిల్

ముంబై: బాలీవుడ్‌లో ప్రస్తుతం మహిళలకు పవర్‌ఫుల్ రోల్స్ వస్తున్నాయని నటి మహీ గిల్ అన్నారు. 40 ఏళ్లు పైబడినా ప్రధాన పాత్రల్లో నటించే ఆఫర్లు రావడంపై ఆమె స్పందించారు. తాను 40 ఏళ్ల మహిళగా ఎప్పుడూ ఫీల్ అవలేదని.. బహుశా ప్రేక్షకులు కూడా ఇదే విధంగా ఫీల్ అవుతూ ఉండొచ్చని ఆమె అన్నారు. బాలీవుడ్‌లో ప్రస్తుతం మహిళల రోల్ చాలా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంతకు ముందు నటికి పెళ్లి అయి పిల్లలు పుడితే ఆమె కెరీర్ అయిపోయిందనే కామెంట్లు వినిపించేవని.. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మహీ గిల్ అన్నారు. ‘విద్యాబాలన్‌‌ను చూడండి.. ఆమె చేస్తున్న పని నిజంగా అద్భుతం’ అని మహీ గిల్ అన్నారు. అయితే మహిళలు సాధించాల్సింది ఇంకా చాలానే ఉందని ఆమె చెప్పారు. 


వెస్టర్న్ దేశాల్లో మెరైల్ స్ట్రీప్ వంటి 60 ఏళ్లు పైబడిన నటులు ఇప్పటికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని మహీ గిల్ వివరించారు. చేసిన పాత్రలనే చేయాలంటే తనకు కూడా బోర్ కొడుతోందని ఈ సందర్భంగా మహీ గిల్ తెలిపారు. ఇంతవరకు ఎన్నడూ చేయని పాత్రల్లో నటించాలనేది తన కోరిన అని మనసులో ఉన్న మాటను చెప్పుకొచ్చారు. హర్రర్ థ్రిల్లర్లలో ఇప్పటివరకు నటించే అవకాశం రాలేదని.. ఒకవేళ ఈ జానర్‌లో మంచి పాత్ర వస్తే తప్పకుండా నటించేందుకు తాను సిద్దమని మహీ గిల్ అన్నారు. తనకు స్క్రిప్ట్ వర్క్‌, ప్రొడక్షన్ హౌస్ చాలా ముఖ్యమైన అంశాలని ఆమె తెలిపారు. ఎందుకంటే ఎంతో కష్టపడి నటించిన చిత్రం అనుకున్న స్థాయికి రీచ్ కాకపోతే అప్పటివరకు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుందని మహీ గిల్ అభిప్రాయపడ్డారు. తాను తన రోల్‌కు ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యమిస్తానని, పెద్ద సినిమాలో ఆశించిన రోల్ రాకపోతే అది తనను ఎంత మాత్రం ఉత్తేజపరచదని మహీ గిల్ అన్నారు. కాగా.. 2018లో తెలుగులో రిలీజ్ అయిన భాగమతి అనే చిత్రాన్ని బాలీవుడ్‌లో దుర్గామతిగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అనుష్క నటించిన పాత్రలో మహీ గిల్ నటించారు. డిసెంబర్ 11న ఈ చిత్రం విడుదల కానుంది.

Advertisement
Advertisement
Advertisement