నేను చేవెళ్ల బిడ్డను.. అక్కడి నుంచే పోటీ చేస్తా

ABN , First Publish Date - 2022-05-17T04:28:01+05:30 IST

వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల గడ్డ నుంచే పోటీ చేస్తానని, నాపై కావాలనే

నేను చేవెళ్ల బిడ్డను.. అక్కడి నుంచే పోటీ చేస్తా
చేవెళ్లలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే

  • నాపై దుష్ప్రచారం మానుకోవాలి : ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల, షాబాద్‌, మే 16 : వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల గడ్డ నుంచే పోటీ చేస్తానని, నాపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య మండిపడ్డారు. వికారాబాద్‌ నుంచి పోటీ చేస్తానని కొందరు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ‘నేను చేవెళ్ల బిడ్డను.. నా మండలం చేవెళ్ళ నియోజకవర్గంలోనే’ ఉందన్నారు. గెలిచినా.. ఓడినా చేవెళ్ల నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య జన్మదిన వేడుకలు సోమవారం చేవెళ్లలోని కేజీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, షాబాద్‌ జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి, ప్రజాప్రతినిధుల సమక్షంలో కేక్‌ కట్‌చేశారు. ఈసందర్భంగా శంకర్‌పల్లి 14వవార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ శ్వేతాపాండురంగారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం, బ్రేడ్‌, పండ్లు, వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేశారు. 

కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మీప్రవీణ్‌కుమార్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రాంరెడ్డి, కౌన్సిలర్లు రాధాబాలకృష్ణ, గోపాల్‌, నాయకులు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, శ్రీనివా్‌సగౌడ్‌, రాజేశ్వర్‌గౌడ్‌, రఘు, మణికంఠ, శ్రీనివా్‌సరెడ్డి, చంద్రశేఖర్‌, చేవెళ్ల మండల వైస్‌ ఎంపీపీ శివప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, ప్రధానకార్యదర్శి హన్మంత్‌రెడ్డి, మాజీ ఎంపీపీ బాల్‌రాజ్‌, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శేరి శివారెడ్డి, నాయకులు దేవర కృష్ణారెడ్డి, చింటు, మాధవరెడ్డి, యాదగిరి, వెంకటేష్‌, రవీందర్‌, నరేందర్‌, కరుణాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ షాబాద్‌ మండల అధ్యక్షులు నర్సింగ్‌రావ్‌, ప్రధానకార్యదర్శి శ్రీరాంరెడ్డి, యూత్‌ ప్రెసిడెంట్‌ పీసరి సతీ్‌షరెడ్డి, యూత్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షబ్బీర్‌అలీ, నాయకులు నక్క శ్రీనివా్‌సగౌడ్‌, మద్దూరి మల్లేష్‌, పరిగి గణే్‌షగౌడ్‌, రాంరెడ్డి, ఇబ్రహీం, మల్లేష్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-17T04:28:01+05:30 IST