YCP MLA: గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధికి అస్వస్థత

ABN , First Publish Date - 2022-08-04T14:12:27+05:30 IST

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధి అస్వస్థతకు గురయ్యారు.

YCP MLA: గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధికి అస్వస్థత

ఎన్టీఆర్: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధి (Rakshanan nidhi) అస్వస్థతకు గురయ్యారు. గత మూడు రోజుల క్రితం వారి కుటుంబంలో విషాదం నెలకొనగా... నిన్న తిరువురు టౌన్‌లో పెన్షన్ల పంపిణీ, గడపగడపకు పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ((MLA)పాల్గొన్నారు. ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అర్ధాంతరంగా ముగించారు. నిన్న సాయంత్రం స్థానికంగా వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో గత రాత్రి విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రక్షణ నిధి తీవ్ర జ్వరంతో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2022-08-04T14:12:27+05:30 IST