వ్యాక్సిన్ వేసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

ABN , First Publish Date - 2021-01-16T19:15:21+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే.

వ్యాక్సిన్ వేసుకున్న హెల్త్ వర్కర్‌కు అస్వస్థత

విజయవాడ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పంపిణీ కార్యక్రమం చురుగ్గా జరుగుతోంది. కాగా విజయవాడలోని జీజీహెచ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్న హెల్త్ వర్కర్‌ అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ వేసిన వెంటనే హెల్త్‌ వర్కర్‌ రాధ కళ్లు తిరిగి ఇబ్బందికి లోనయ్యారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.


ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా 3,006 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ మొదలయింది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.  కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలన జరగనుంది. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అధికారులు పర్యవేక్షించనున్నారు. నిరంతర ప్రక్రియకు కేంద్రం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేసింది.

Updated Date - 2021-01-16T19:15:21+05:30 IST