అలకోని చెరువులో అక్రమ వెంచర్లు...ధ్వంసం చేసిన అధికారులు
ABN , First Publish Date - 2020-03-12T15:51:17+05:30 IST
అలకోని చెరువులో అక్రమ వెంచర్లు...ధ్వంసం చేసిన అధికారులు
బాలాపూర్: రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం సుల్తాన్‌పూర్ అలకోని చెరువులో అక్రమ వెంచర్లను రెవెన్యూ అధికారులు గురువారం ఉదయం ధ్వంసం చేశారు. ఇప్పటికే ప్రైడ్ ఇండియా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. అలకోని చెరువు కబ్జాపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు చెరువులో వేసిన రోడ్లు, ప్రహరీగోడలను ధ్వంసం చేశారు. చెరువు పరిధిలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆదేశిస్తామని తహసీల్దార్ తెలిపారు.