అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-06-27T06:25:17+05:30 IST

జగిత్యాల డివిజన్‌ వి ద్యుత్‌ కార్యాలయ పరిధిలోని విద్యుత్‌ శాఖ ఉద్యోగు ల అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని వి ద్యుత్‌ ఉద్యోగ కార్మిక సంఘాల డిమాండ్‌ చేశారు.

అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలి
ధర్నా చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు

విద్యుత్‌ ఉద్యోగ కార్మిక సంఘాల డిమాండ్‌ 

జగిత్యాల అర్బన్‌, జూన్‌ 26: జగిత్యాల డివిజన్‌ వి ద్యుత్‌ కార్యాలయ పరిధిలోని విద్యుత్‌ శాఖ ఉద్యోగు ల అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని వి ద్యుత్‌ ఉద్యోగ కార్మిక సంఘాల డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని స్ధానిక విద్యుత్‌ డివిజనల్‌ కార్యాల యం ఎదుట డీఈ వైఖరిని నిరసిస్తూ నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూ న్‌ 1న ఎన్‌పీడీసీఎల్‌ సంస్థ మార్గదర్శకాలకు విరు ద్దంగా చేపట్టిన బదిలీలను రద్దు చేయాలన్నారు. ప్రొ టెక్షనర్‌ ఎంపికలో అక్రమాలు జరిగాయని, ఒక యూ నియన్‌ సంబంధించి అధ్యక్ష, కార్యదర్శులకు మాత్రమే ప్రొటెక్షనర్‌గా హోదా ఇవ్వాల్సి ఉండగా, అందుకు భి న్నంగా ఒకే యూనియన్‌ నుంచి ముగ్గురికి ప్రొటెక్షన ర్‌గా అవకాశం కల్పించారని, వెంటనే దాన్ని రద్దు చే యాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌పీడీసీ ఎల్‌ పరిధిలో ఈ నెల 25లోపు బదిలీల గడువు ముగియాల్సి ఉం డగా, జగిత్యాల డివిజన్‌ పరిధిలో ఆదివారం వరకు బ దిలీల ఆర్డర్‌లు ఇవ్వకపోవడం విచారక రమన్నారు.  శనివారం రాత్రి నుంచి ఆర్డర్‌ల కోసం పడిగాపులు కా సిన ఆర్డర్‌లు ఇవ్వలేదని ఒక యూనియన్‌కు డివిజ నల్‌ స్థాయి అధికారి కొమ్ముకాస్తూ తమను చులకన గా చూస్తూ అవినీతికి తెరలేపుతున్నారని ఆరోపించా రు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ ఉద్యోగ సంఘాల నా యకులు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T06:25:17+05:30 IST