అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలి

ABN , First Publish Date - 2022-06-26T05:53:22+05:30 IST

అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలి

అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలి
ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు

రంగారెడ్డి అర్బన్‌, జూన్‌ 25:  నల్లగొండ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు వచ్చిన మణిపాల్‌రెడ్డి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య పోరాట సంఘం నేతలు డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి మహిపాల్‌రెడ్డి అనే ఉపాధ్యాయుడిని నల్లగొండ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాకు బదిలీచేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటోనని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లా పరిధిలో బదిలీలుచేపట్టాల్సి ఉండగా ప్రభుత్వం జిల్లా దాటి ఇలాంటి అక్రమబదిలీలు చేపట్టడం శోచనీయమన్నారు. విద్యాశాఖ మంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి అక్రమ బదిలీలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వెంటనే సాధారణ బదిలీల షెడ్యూల్‌ విడుదల చేయాలన్నారు. ఈధర్నా కార్యక్రమంలో టీఎ్‌సయూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు పి.మాణిక్‌రెడ్డి, ఈ.గాలయ్య,  జిల్లా ఎస్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజమణి, ప్రవీణ్‌రావు, కృష్ణారెడ్డి, వీరమణి, రాములయ్య, వెంకటప్ప, మేడ్చల్‌ జిల్లా అధ్యక్ష ప్రధానకార్యదర్శులు జయసింహారెడ్డి, రమేష్‌, వెంకటేశ్వర్లు, ప్రేమ్‌కుమార్‌, ప్రతాప్‌, యాదగిరి, దామోదర్‌, కల్పన, జగన్నాథ్‌, గోపాల్‌, భగవంత, రఘుపాల్‌, నర్సింహులుగౌడ్‌, గణే్‌షకుమార్‌, భీమ్‌రెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-26T05:53:22+05:30 IST