అక్రమ ఇసుక రవాణా ముఠా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2020-08-05T11:53:06+05:30 IST

ప్రభుత్వ పనుల పేరుతో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో ప్రత్యేక నిఘావేసి ముఠా సభ్యులను అదుపులోకి..

అక్రమ ఇసుక రవాణా ముఠా గుట్టు రట్టు

9 మంది అరెస్టు, 11 లారీలు స్వాధీనం


సామర్లకోట, ఆగస్టు 4: ప్రభుత్వ పనుల పేరుతో ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో ప్రత్యేక నిఘావేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసు కున్నామని సీఐ విజయ్‌బాబు, ఎస్‌ఐలు సుమంత్‌, బా లాజీ తెలిపారు.  సామర్లకోట, పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 285 టన్నుల ఇసుకను  స్వాధీనం చేసు కున్నామన్నారు.  ప్రభుత్వ పనుల పేరిట ఇసుకను బల్క్‌ ఆర్డర్లు తీసుకుని బ్లాక్‌ మార్కెట్లో  రూ. 15 వేలకు విక్రయించాల్సిన ఇసుకను రూ.30 వేలకు అమ్ము తున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇసుక ర్యాంపు నిర్వాహకుడు అనిల్‌కుమార్‌ను ప్రధాన సూత్ర ధారిగా గుర్తించామన్నారు.


అతనితో పాటు మరో 9 మందిని అదుపులోకి తీసుకుని   కేసులు నమోదు చేశామని, మరో  ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ చెప్పారు. అక్రమ రవాణాకు విని యోగించిన 11 లారీలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.  పోలీస్టేషన్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశానికి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీ సుమిత్‌ హాజరైనప్పటికీ  కేసు షీటు తయారు చేయడంలో స్పష్టత లేదంటూ స్థానిక పోలీసు అధికారులపై అసహనం వ్యక్తంచేసి  సమా వేశంలో పాల్గొనకుండా వెళ్లిపోవడం గమనార్హం.  నిందితులను కేసు నుంచి బయట పడి వేసేందుకు రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.  

Updated Date - 2020-08-05T11:53:06+05:30 IST