Abn logo
Aug 14 2020 @ 15:43PM

మద్యం మాఫియా గుట్టు రట్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు

విశాఖపట్నం : ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి అక్రమంగా విక్రయిస్తున్న మద్యం మాఫియా గుట్టును ఎక్సైజ్ పోలీసులు రట్టు చేశారు. తెలంగాణ నుంచి తీసుకువస్తున్న 525 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురు వ్యక్తులు రెండు వాహనాల్లో తెలంగాణ నుండి ఆంధ్రాకు మద్యం తీసుకువస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఇది గుర్తించిన అధికారులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణకు చెందిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారికి చెందిన రెండు వాహనాలను కూడా సీజ్ చేశారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ వెల్లడించారు.

Advertisement
Advertisement
Advertisement