అక్రమ లేఅవుట్లను వెంటనే తొలగించాలి: ఇంద్రకరణ్‌ రెడ్డి

ABN , First Publish Date - 2021-09-30T00:47:32+05:30 IST

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఇబ్రహీం చెరువు పరిసరాల్లో వెలిసిన అక్రమ లేఅవుట్లను వెంటనే తొలగించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

అక్రమ లేఅవుట్లను వెంటనే తొలగించాలి: ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌: నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఇబ్రహీం చెరువు పరిసరాల్లో వెలిసిన అక్రమ లేఅవుట్లను వెంటనే తొలగించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీని ఆదేశించారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా నిర్మల్‌ పట్టణంలో నిండిన ఇబ్రహీం చెరువుతో పాటు నీట మునిగిన 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను మంత్రి బుధవారం పరిశీలించారు. అనంతరం మంత్రి అల్లోల మాట్లాడుతూ ఇబ్రహీం చెరువు పరిసరాల్లో అనుమతి లేకుండా వెలిసిన అక్రమ లే అవుట్లను వెంటనే తొలగించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే ఈ ప్రాంతంలో ప్లాట్లను విక్రయిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొని ఇబ్బందులు పడవద్దని ప్రజలకు మంత్రి సూచించారు.

Updated Date - 2021-09-30T00:47:32+05:30 IST