అక్రమ లేఅవుట్లు గుర్తించి చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-08-15T05:30:00+05:30 IST

జిల్లాలో అక్రమ లే అవుట్లను గుర్తించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు.

అక్రమ లేఅవుట్లు గుర్తించి చర్యలు తీసుకోవాలి

వాటిని విక్రయించకుండా చూడాలి

కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు


కలెక్టరేట్‌(మహబూబ్‌నగర్‌), ఆగస్టు 14: జిల్లాలో అక్రమ లే అవుట్లను గుర్తించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకట్రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఆయన మునిసిపల్‌ కమిషనర్లు, డీపీఓ, పంచా యతీరాజ్‌శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. మునిసిపాలిటీలు, పంచాయతీల పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టిన లే అవుట్లను గుర్తించి, అమ్మకాలు చేపట్టకుండా చర్యలు తీసు కోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్‌ నందలాల్‌ పవార్‌, డీపీ ఓ వెంకటేశ్వర్లు,  మున్సిపల్‌ కమిషనర్లు సునీత, నజీబ్‌, సురేందర్‌, ఆర్డీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. 


అద్దె భవనాలకు హేతుబద్దీకరణ

జిల్లాలోని మైనారిటీ రెసిడెన్షియల్‌ స్కూళ్లు నడుస్తున్న భవనాల అద్దెలను సమావేశంలో క్రమబద్దీకరించారు. ఈ సమావేశంలో భవనాల యజమానులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T05:30:00+05:30 IST