ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్లు రద్దుచేయాలి

ABN , First Publish Date - 2021-10-20T07:10:06+05:30 IST

జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి నిర్వహిస్తున్న అక్రమ డిప్యూటేషన్లను రద్దుచేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఉపాధ్యాయుల అక్రమ డిప్యూటేషన్లు రద్దుచేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి

నల్లగొండ క్రైం, అక్టోబరు 19: జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి నిర్వహిస్తున్న అక్రమ డిప్యూటేషన్లను రద్దుచేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగినందున అందుకు అనుగుణంగా వాలంటీర్లను నియమించాలన్నారు. ఉపాధ్యాయులను ఇటీవల పలు ప్రాంతాలకు అక్రమంగా డిప్యూటేషన్లపై పంపారని, వాటిని రద్దుచేయాలన్నా రు. అదేవిధంగా వివిధ కారణాలతో సస్పెండ్‌ కావాల్సిన ఉపాధ్యాయులను హెచ్‌ఆర్‌ఏ పాఠశాలల్లో పునర్నియమించడం అప్రజాస్వామికమన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి నాగమణి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయులే తాళాలు తీసి గదులు ఊడ్చాల్సి వస్తోందని, మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు కరువయ్యారని అన్నారు. పాఠశాలల్లో పారిశుధ్య పనుల నిర్వహణలో పంచాయతీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, వెంటనే రూ.5వేల వేతనంతో స్కావెంజర్లను నియమించాలని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం వసూలు చేస్తున్న గ్రీన్‌ఫండ్‌ను చెల్లించేందుకు తాము కూడా సిద్ధమేనన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, ఉపాధ్యక్షుడు శ్రీనివాసాచారి, అరుణ, శేఖర్‌రెడ్డి, సత్యనారాయణ, రామలింగయ్య, నర్సింహ, శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T07:10:06+05:30 IST