అభివృద్ధి పేరిట అక్రమ దందా

ABN , First Publish Date - 2020-10-01T10:10:36+05:30 IST

అభివృద్ధి పనుల పేరిట కొందరు అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మొరాన్ని అక్రమంగా తరలిస్తూ జేబులు

అభివృద్ధి పేరిట అక్రమ దందా

రుద్రూరు మండలంలో జోరుగా మొరం తరలింపు

అనుమతులు లేకున్నా యథేచ్ఛగా తవ్వకాలు

ప్రకృతి సంపదను దోచుకుంటున్న అక్రమారులు

చూసీచూడనట్లు వదిలేస్తున్న  సంబంధిత అధికారులు


రుద్రూరు, సెప్టెంబరు 30 : అభివృద్ధి పనుల పేరిట కొందరు అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. మొరాన్ని అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అక్రమ మొరం దందాకు రుద్రూరు మండలం కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. మండలంలో యథేచ్ఛగా మొరం దందా జోరుగా కొనసాగు తోంది. గ్రామాల్లో అక్రమార్కులు మూడు టిప్పర్లు, ఆరు ట్రాక్టర్ల అన్నచందంగా మొరం దందాను చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులపై ఎ లాంటి చర్యలు తీసుకోకుండా చూసీచూడన్లు వ్యవహిస్తున్నారని, దీంతో నిత్యం వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లలో మొరం తరలిపోతోందని పేర్కొంటున్నారు. 


అనుమతులు లేకున్నా...

లాక్షలాది రూపాయలు సంపాదించేందుకు అక్రమార్కులు మొరం దందాను ఎంచుకున్నారు. రుద్రూరు మండలంలో ఈ దందా సం బంధిత అధికారులు అనుమతులు లేకున్నా మూడు ముప్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ వ్యాపారంతో లక్షల రూపాయల ఆదాయాన్ని రాబట్టుకుంటున్నారు. అక్ర మ మొరం దందా యథేచ్ఛగా సాగుతున్నా సంబంధిత అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.


అక్రమంగా మొరం తరలిస్తే చర్యలు 

అనుమతులు లేకుండా అక్రమంగా మొరం తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారినైనా విడిచిపెట్టం. అనుమతులు తీసుకొని మొరం తవ్వ కాలు జరపాలి. లేకుంటే టిప్పర్‌, ట్రాక్టర్‌లను సీజ్‌ చేస్తాం. 

- రాంబాబు, తహసీల్దార్‌ 


ధ్వంసం అవుతున్న రోడ్లు..

నిబంధపలు విరుద్ధంగా పరిమితికి మించిన మొ రం లోడ్‌తో టిప్పర్లు వెళ్తుండడంతో గ్రామాల్లోని రో డ్లు ధ్వంసం అవుతున్నాయి. గుంతలు పడి ఇతర వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడు తున్నారు. టిప్పర్లు అధికవేగంతో వెళ్తుండడంతో రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు భయాందోళనకు గుర వుతున్నారు. టిప్పర్లు వెళ్తున్నప్పుడు వచ్చే దుమ్ము తో ఊపిరి బిగపట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకటి రెండు టిప్పర్లంటే ఏమోగనీ పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్లు వెళ్తుండడంతో దుమ్ము, దూళి రోడ్డు పక్కన ఉన్న దుకాణాల్లో చేరి ఇబ్బందులు పడుతున్నా మని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-10-01T10:10:36+05:30 IST