కప్పు వేసి ప్లాస్టింగ్ చేసిన దృశ్యం
వీరవాసరం, మే 21 : పంజా వేమవరం–లంకలకోడేరు రహదారిపై ఉమా మూలేశ్వరస్వామి ఆలయానికి చేర్చి రహదారులు భవనాలు శాఖ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. గతంలో ఈ స్థలంలో ఉన్న కట్టడాన్ని పునర్నిర్మాణం చేస్తున్న వ్యవహారంలో గ్రామస్థుల నుంచి అధికారులకు పిర్యాదులు అందాయి. దీనిపై ఏప్రిల్ 27న ‘ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన తహసీల్దార్ ఎం.సుందరరాజు, రహదారుల భవనాలశాఖ ఏఈ మూర్తి, పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేశా రు. పనులు కొనసాగించరాదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొద్దిరోజులుగా స్తబఽ్ధతగా ఉండి మళ్లీ అక్రమ నిర్మాణ పనులు ప్రారంభించారు. గోడలపై కప్పు వేయడమే కాకుండా సిమెంట్ ప్లాస్టింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేస్తున్నారు. ఇది అఽధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. ఈ కట్టడం వల్ల దేవాలయం మండపానికి, దేవాలయానికి ఇబ్బంది ఉన్నప్పటికీ దేవదాయ ధర్మదాయశాఖ అధికారులు గాని, పాలకమండలిగాని పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారని భక్తులు, గ్రామస్థులు విమర్శిస్తున్నారు.