బయో మోసాలు..

ABN , First Publish Date - 2020-02-20T10:23:53+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో అనుమతులు లేని, బినామీ పేర్లతో నడుస్తున్న నకిలీ బయో కంపెనీల మోసాలు వెలుగులోకి వచ్చాయి. వడ్డేపల్లి,

బయో మోసాలు..

  • అనుమతుల్లేని కంపెనీలు.. తనిఖీలతో వెలుగులోకి 

గద్వాల( ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వాల జిల్లాలో అనుమతులు లేని, బినామీ పేర్లతో నడుస్తున్న నకిలీ బయో కంపెనీల మోసాలు వెలుగులోకి వచ్చాయి. వడ్డేపల్లి, ఉండవల్లి, అయిజ మండలాల్లో తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాల్లో గట్టుచప్పుడు కాకుండా బయో కెమికల్స్‌ పేరుతో ఎరువులను తయారు చేస్తున్నారు. అధికారులు తనిఖీలు నిర్వహించి రూ.కోటి విలువైన అనుమతి లేని సరుకులు ఉన్నాయని తేల్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఒకే ఒక్క బయో కంపెనీలో మందుల తయారీకి అనుమతులున్నాయి. కానీ తుంగభద్ర నది సమీపంలో 8కంపెనీలను అక్రమంగా నడుపుతున్నారు. శాంతినగర్‌లో గ్రీన్‌ప్లాంట్‌ కంపెనీ చాలా కాలంగా నడుస్తోంది. వడ్డేపల్లి, మానవపాడు మండలాల్లోనూ మరికొన్ని బయోసీడ్స్‌ కంపెనీలున్నాయి.

Updated Date - 2020-02-20T10:23:53+05:30 IST