బస్సులో అక్రమంగా మద్యం తరలింపు

ABN , First Publish Date - 2020-08-10T11:19:16+05:30 IST

కడప-బెంగుళూరు ఆర్టీసీ బస్సులో ఓ డ్రైవరు అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆర్టీసీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు

బస్సులో అక్రమంగా మద్యం తరలింపు

ఆర్టీసీ డ్రైవరు అరెస్టు

27 వేల విలువ చేసే బాటిళ్లు స్వాధీనం


కడప (క్రైం), ఆగస్టు 9 : కడప-బెంగుళూరు ఆర్టీసీ బస్సులో ఓ డ్రైవరు అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆర్టీసీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు పట్టుకున్నట్లు కడప చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి తె లిపారు. సీఐ వివరాల మేరకు జయచంద్ర కడప-బెంగుళూరు బస్సు డ్రైవరుగా ఉన్నాడు. బెంగుళూరు నుంచి 17 ఫుల్‌బాటిల్స్‌, 55 హాఫ్‌ బాటిల్స్‌, 190 క్వార్టర్‌ బాటిల్స్‌ తీసుకుని బస్సులో అక్రమంగా కడపకు తీసుకువస్తున్నట్లు సమాచారం రావడంతో ఆర్టీసీ అధికారులు అతడిని పట్టుకుని రూ.27,580 విలువ చేసే మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్‌ను వారు చిన్నచౌకు పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు అతడిని రిమాండుకు తరలించినట్లు తెలిపారు. 

Updated Date - 2020-08-10T11:19:16+05:30 IST