Abn logo
Sep 21 2020 @ 13:48PM

బాధ్యతల నుండి తప్పించుకుంటున్నా: ఇలియానా

Kaakateeya

తెలుగులో 'దేవదాస్‌' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానాకు 'పోకిరి' సినిమా తిరుగులేని క్రేజ్‌ను తీసుకొచ్చింది. స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌తో స్టార్‌ హీరోలందరితోనూ ఆమె ఆడిపాడింది. అయితే బాలీవుడ్‌లో అవకాశం రావడంతో టాలీవుడ్‌ను ఇలియానా పట్టించుకోలేదు. అదే సమయంలో ప్రేమ వ్యవహారంతో బాలీవుడ్‌ సినిమాల ఎంపికలోనూ శ్రద్ధపెట్టలేదు. దీంతో ఇలియానాకు బాలీవుడ్‌లోనూ అవకాశాలు తగ్గాయి. తర్వాత టాలీవుడ్‌లో 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'తో రీ ఎంట్రీ కోసం గట్టి ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. అడపాదడపా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న ఈ జగన సుందరి సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటోంది. తన గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నాలైతే బలంగానే చేస్తోంది. కాగా..లేటెస్ట్‌గా ఇన్‌స్టాలో ఇలియానా ఓ వీడియో పోస్ట్‌ చేసింది. ఇందులో ఆమె తెప్పను నడుపుతుంది. ఈ వీడియోను పోస్ట్‌ చేయడమే కాకుండా 'నా బాధ్యతల నుండి పారిపోతున్నా బై' అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. 



Advertisement
Advertisement
Advertisement