May 16 2021 @ 15:22PM

బిజినెస్ ప్లాన్‌లో ఇలియానా..!

గోవా బ్యూటీ ఇలియానా కొత్త బిజినెస్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటుందట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సినిమా కెరీర్ ఆశించినంతగా సాగకపోవడంతో ఇలా సైడ్ బిజినెస్ ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటుందట. అందులో భాగంగానే లాక్ డౌన్ తర్వాత రెస్టారెంట్లు, బేకరీల చైన్ బిజినెస్ మొదలు పెట్టే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. తన పేరుతోనే వీటిని మార్కెట్ చేసుకోవాలనుకుంటుందట. ఇప్పటికే ఇలియానా పేరుతో డిజైనర్ గార్మెంట్స్ బోటిక్ ఉన్న సంగతి తెలిసిందే. ముంబై, హైదరాబాద్‌లలో ఈ బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న కొవిడ్ నేపథ్యంలో కొత్త బిజినెస్ అంటూ ఇలియానా పెద్ద రిస్కే చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌లోనే ఒక్కో సినిమా చేస్తూ వస్తోంది.