Abn logo
Jul 13 2020 @ 16:32PM

ఇలియానా.. సినిమాలను పక్కన పెట్టేసినట్టేనా?

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అడపాదడపా విజయాలు అందుకున్నా ఆమెకు డిమాండ్ మాత్రం పెరగలేదు. దీంతో ఓటీటీలపై దృష్టి పెట్టాలని ఇలియానా డిసైడ్ అయిందట. నెట్ ఫ్లిక్స్, ఆల్ట్ బాలాజీ వంటి సంస్థలతో ఇలియానా డీల్ కుదుర్చుకోవాలనుకుంటోందట. 


ఓ వెబ్ సిరీస్‌లో నటించడంతోపాటు మరో వెబ్ సిరీస్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తోందట. దక్షిణాదిన కూడా ఇలియానాకు గుర్తింపు ఉండడంతో ఓటీటీలు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టు సమాచారం. ఇలియానా నటిస్తానంటే భారీ రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కొన్ని నిర్మాణ సంస్థలు సిద్ధంగానే ఉన్నాయట. దీంతో ప్రస్తుతానికి సినిమాలను పక్కనపెట్టి వెబ్ సిరీస్‌లపైనే దృష్టి సారించాలని ఇలియానా ఫిక్స్ అయిందట.  

Advertisement
Advertisement
Advertisement