Abn logo
Nov 22 2020 @ 00:26AM

షూటింగ్‌కు ఇలియానా ప్యాకప్‌

Kaakateeya

రణదీప్‌హుడా, ఇలియానా జంటగా నటిస్తోన్న బాలీవుడ్‌ చిత్రం ‘అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్‌లీ’ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. చివరి రోజు షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇలియానా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తెల్లటి చర్మంపై ప్రజల్లో ఉన్న మోజు నేపథ్యంలో హాస్య ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఇలియానా హర్యానా యువతిగా నటిస్తున్నారు. షూటింగ్‌ చివరిరోజున ఇలియానా, రణదీప్‌హుడా, దర్శకుడు బల్వీందర్‌ సింగ్‌ జంజువా సెట్‌లో సందడి చేశారు. ‘‘షూటింగ్‌  మిస్సవుతున్నాను. ఈ చిత్రం విడుదలకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’’ అని రణ్‌దీప్‌ హుడా పేర్కొన్నారు.  

Advertisement
Advertisement