Food Festival: ఐలాండ్‌ గ్రౌండ్స్‌లో ఫుడ్‌ఫెస్టివల్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2022-08-13T15:10:09+05:30 IST

స్థానిక ఐలాండ్‌ గ్రాండ్స్‌లో తమిళ ప్రాచీన, సంప్రదాయక, రసాయనాలకు తావులేని గ్రామీణ వంటకాలతో శుక్రవారం ఉదయం ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైం

Food Festival: ఐలాండ్‌ గ్రౌండ్స్‌లో ఫుడ్‌ఫెస్టివల్‌ ప్రారంభం

చెన్నై, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఐలాండ్‌ గ్రాండ్స్‌లో తమిళ ప్రాచీన, సంప్రదాయక, రసాయనాలకు తావులేని గ్రామీణ వంటకాలతో శుక్రవారం ఉదయం ఫుడ్‌ ఫెస్టివల్‌ ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను మంత్రులు ఎం. సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు(Ministers M. Subramaniam and PK Shekhar Babu) ప్రారంభించారు. గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియా, డిప్యూటీ మేయర్‌ మహేష్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 14వ తేదీ వరకూ కొనసాగనుంది. రాష్ట్ర ఆహార భద్రతా సంస్థ ఆధ్వర్యంలో నగరవాసులకు గ్రామీణ వంటకాల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించే దిశగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో 100 రకాలకు చెందిన రుచికరమైన ఆహరపదార్థాలు చోటు చేసుకున్నాయి. 

Updated Date - 2022-08-13T15:10:09+05:30 IST