గ్రామీణ విద్యార్థులకు వెరిజాన్‌, ఐఐటీ-ఎం శిక్షణ

ABN , First Publish Date - 2020-02-22T07:10:48+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఇంజనీరింగ్‌ రంగంలో కొత్త అవకాశాలను కల్పించేందుకై వెరిజాన్‌ ఇండియా, ఐఐటీ మద్రా్‌సతో జత కట్టింది.

గ్రామీణ విద్యార్థులకు వెరిజాన్‌, ఐఐటీ-ఎం శిక్షణ

చెన్నై: గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఇంజనీరింగ్‌ రంగంలో కొత్త అవకాశాలను కల్పించేందుకై వెరిజాన్‌ ఇండియా, ఐఐటీ మద్రా్‌సతో జత కట్టింది. ‘వన్‌ ల్యాబ్‌-వన్‌ స్కూల్‌’ పేరిట నిర్వహించే ఈ కార్యక్రమంలో.. తమిళనాడు గ్రామాల్లోని ఉన్నత పాఠశాలలకు అత్యున్నత గ్రాడ్యుయేట్‌ పరిశోధనశాలలను ఐఐటీ (ఎం) అనుసంధానం చేయనుంది. ఈ ప్రాజెక్టుకు పూర్తి నిధుల్ని వెరిజాన్‌ సమకూర్చనుంది. దీనికోసం ఐఐటీ-మద్రా్‌సలోని సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఎంఎస్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ విద్యార్థులతో కూడిన పరిశోధన బృందాలు గ్రామీణ ఉన్నత పాఠశాలల్ని దత్తత తీసుకోనున్నాయి.  2018 జూన్‌ నుంచి మొత్తం 20 బృందాలు 20 పాఠశాలతో అనుసంధానమయ్యాయని, తొమ్మిదవ తరగతికి చెందిన 800 మంది విద్యార్థులకు 150 మంది గ్రాడ్యుయేట్లు శిక్షణను అందించారని ఐఐటీ-మద్రాస్‌ వెల్లడించింది. భారత్‌లో శాస్త్రీయ విద్యాబోధనను  మార్చే శక్తి ఈ కార్యక్రమానికి ఉందని వెరిజాన్‌ ఇండియా ధీమా వ్యక్తం చేసింది. 

Updated Date - 2020-02-22T07:10:48+05:30 IST