Abn logo
Feb 21 2020 @ 12:20PM

మద్రాస్ ఐఐటీ ఉద్యోగి పాడు బుద్ధి.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్

చెన్నై: మద్రాసు ఐఐటీలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. బాత్‌రూమ్‌లో వీడియోలు తీస్తున్నాడన్న ఆరోపణలపై ఓ ప్రొఫెసర్‌పై కేసు నమోదైంది. కొట్టుపురం పోలీసుల కథనం ప్రకారం.. శుభమ్ బెనర్జీ మద్రాసు ఐఐటీలోని ఎయిరో స్పేస్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. అదే కాలేజీలో బాధితురాలు పరిశోధన విద్యార్థినిగా ఉన్నారు. సోమవారం రాత్రి ఆమె తరగతి గది నుంచి బయటకు వచ్చి బాత్‌రూమ్‌కు వెళ్లగా.. ఎవరో తనను వీడియో తీస్తున్నట్టుగా కనిపించింది. వెంటనే బయటకు వచ్చి  పక్కన ఉన్న పురుషుల బాత్ రూమ్ గది గొళ్లెం పెట్టేశారు. సహ విద్యార్థులను, అధ్యాపకులను పిలిచి తలుపు తీయగా లోపల బెనర్జీ ఉన్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


పోలీసులు సదరు ప్రొఫెసర్ మొబైల్‌ను పరిశీలించగా అందులో ఎలాంటి వీడియోలు లేవు. డిలీట్ చేసినట్టు భావిస్తున్నారు. ఆ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించామని.. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే శుభమ్ బెనర్జీకి బెయిల్ లభించింది. 

Advertisement
Advertisement
Advertisement