అత్యుత్తమ విద్యా సంస్థగా Iit madras

ABN , First Publish Date - 2022-07-16T14:08:14+05:30 IST

దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటీ మద్రా్‌సను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లోని సదుపాయాలు,

అత్యుత్తమ విద్యా సంస్థగా Iit madras

                             - ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 


చెన్నై, జూలై 15 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటీ మద్రాసును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లోని సదుపాయాలు, విద్యా ప్రమాణాలను పరిశీలించి ఉత్తమ విద్యా సంస్థలను ఎంపిక చేసి జాబితా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యేడాదికి సంబంధించి కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఉత్తమ విద్యా సంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్‌ ప్రథమ స్థానం పొందింది. ఢిల్లీ, కాన్పూర్‌ కోల్‌కతా ఐఐటీలు ద్వితీయ స్థానంలో నిలిచాయి. అదేవిధంగా కళాశాలల్లో నగరంలోని రాజధాని కళాశాలకు తృతీయ స్థానం, లయోలా కళాశాల నాలుగోస్థానం లభించింది.  

Updated Date - 2022-07-16T14:08:14+05:30 IST