ముంబై: మహారాష్ట్ర ముంబై నగరంలోని బొంబాయి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఓ విద్యార్థి సోమవారం తెల్లవారుజామున క్యాంపస్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 26 ఏళ్ల విద్యార్థి మాస్టర్స్ ద్వితీయ సంవత్సరం చదివేవాడు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు విద్యార్థి ఐఐటీ 7వ అంతస్తు నుంచి కిందకు దూకాడని పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఘట్‌కోపర్‌లోని రాజావాడి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అతడి హాస్టల్ గదిలో నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాను డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నానని విద్యార్థి నోట్‌లో పేర్కొన్నాడు. తన మరణానికి ఎవరినీ బాధ్యులను చేయలేదని పోలీసులు సూసైడ్ నోట్‌ను ప్రస్తావిస్తూ చెప్పారు.ఈ ఘటనపై పొవాయ్ పోలీసులు ప్రమాదవశాత్తు మృతి కేసుగా నమోదు చేశారు. ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య ఘటనపై ముంబై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి