ఐఐపీ క్షీణత -10.4 శాతం

ABN , First Publish Date - 2020-09-12T06:24:37+05:30 IST

దేశంలో పారిశ్రామికోత్పత్తి నిరాశావహంగానే కొనసాగుతోంది.

ఐఐపీ క్షీణత -10.4 శాతం

న్యూఢిల్లీ: దేశంలో పారిశ్రామికోత్పత్తి నిరాశావహంగానే కొనసాగుతోంది. తయారీ, గనులు, విద్యుత్‌ ఉత్ప త్తి రంగాల ఉత్పత్తి క్షీణించడంతో జూలైలో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) -10.4 శాతం ప్రతికూల వృద్ధి ని నమోదు చేసింది. గత ఏడాది జూలైలో ఐఐపీ 4.9 శాతం ఉంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన సంపూర్ణ, పాక్షిక లాక్‌డౌన్ల ప్రభావం పారిశ్రామికోత్పత్తిపై తీవ్ర స్థాయిలో పడడమే ఇందుకు కారణం. ఆంక్షలు సడలిస్తున్న కొద్ది పారిశ్రామికోత్పత్తి కూడా పుంజుకుంటోందని గణాంక శాఖ తెలిపింది. 

Updated Date - 2020-09-12T06:24:37+05:30 IST