Abn logo
Oct 28 2020 @ 03:44AM

ధోనీ.. అత్యంత గౌరవమైన వ్యక్తి

Kaakateeya

ఐఐహెచ్‌బీ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు చెత్త ప్రదర్శన చేసినా, కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి అభిమానుల్లో ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యూమన్‌ బ్రాండ్స్‌ (ఐఐహెచ్‌బీ) చేసిన సర్వేలో ధోనీ.. క్రీడా ప్రపంచంలో అత్యంత నమ్మదగిన, గౌరవమైన వ్యక్తిగా అగ్రస్థానం సంపాదించాడు. ‘సెలెబ్రిటీ ఆఫ్‌ హ్యూమన్‌ బ్రాండ్స్‌’ పేరిట ఐఐహెచ్‌బీ ఈ సర్వే చేయించింది. ఇందులో 23 నగరాల నుంచి 60 వేల మంది పాల్గొన్నారు. నమ్మకం, గుర్తింపు, ఆకర్షణ, గౌరవం, రూపం ఆధారంగా 180 మంది సెలెబ్రిటీలపై ఈ సర్వే చేశారు. వీరిలో ఎక్కువమంది ధోనీకి ఓటేశారు. ఇక, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అతని భార్య అనుష్క శర్మ అత్యంత నమ్మదగిన, గౌరవమైన సెలెబ్రిటీ కపుల్‌గా నిలిచారు.  

Advertisement
Advertisement