ప్రజా సమస్యలు పట్టించుకోరా...

ABN , First Publish Date - 2021-07-27T05:15:26+05:30 IST

‘మా గ్రామంలోని ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. కనీసం మౌలిక వసతులపై కూడా దృష్టి పెట్టడం లేదు. పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. రోగాల బారిన పడుతున్నాం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు’ అంటూ దేవలవలస గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఆ గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు.

ప్రజా సమస్యలు పట్టించుకోరా...
సచివాలయం వద్ద నిరసన తెలియజేస్తున్న దేవలవలస గ్రామస్థులు

- సచివాలయాన్ని ముట్టడించిన దేవలవలస గామస్థులు

- అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై నిరసన

జి.సిగడాం, జూలై 26 : ‘మా గ్రామంలోని ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. కనీసం మౌలిక వసతులపై కూడా దృష్టి పెట్టడం లేదు. పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. రోగాల బారిన పడుతున్నాం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు’ అంటూ దేవలవలస గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సోమవారం ఆ గ్రామ సచివాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్థులు మాట్లాడుతూ... గ్రామ శివారు ప్రధాన రహదారి వర్షపు నీరు, వాడుక నీరుతో నిండిపోయి రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది రోగాల బారినపడ్డారు. ఈ సమస్యను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఫలితం లేకపోయిందని వాపోయారు. దీంతో చేసేదిలేక సచివాలయాన్ని ముట్టడించామని తెలిపారు. దీనిపై మండల అధికారులు స్పందించి రెండురోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారంతా శాంతించారు. ఇటీవల ఈ గ్రామ సమస్యలపై ‘ఆంధ్రజోతి’లో కథనం ప్రచురించడం పాఠకులకు తెలిసిందే. 

Updated Date - 2021-07-27T05:15:26+05:30 IST