అవగాహన లేమి, వలస కార్మికులే సమస్య

ABN , First Publish Date - 2020-04-03T09:26:47+05:30 IST

కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రజల్లో అవగాహన లేమి, వలస కార్మికులు ప్రధాన సమస్య అని దేశవ్యాప్తంగా యువ ఐఏఎ్‌సలతో కేంద్ర శిక్షణ శాఖ నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది. దీంతోపాటు.. ఆస్పత్రుల సన్నద్ధత...

అవగాహన లేమి, వలస కార్మికులే సమస్య

కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టే క్రమంలో ప్రజల్లో అవగాహన లేమి, వలస కార్మికులు ప్రధాన సమస్య అని దేశవ్యాప్తంగా యువ ఐఏఎ్‌సలతో కేంద్ర శిక్షణ శాఖ నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది. దీంతోపాటు.. ఆస్పత్రుల సన్నద్ధత, వనరులు, క్వారంటైన్‌/ఐసోలేషన్‌ సదుపాయాలు, తగినన్ని వ్యాధి నిర్ధారణ కేంద్రాలు లేకపోవడం, వైద్యులు/సిబ్బందికి రక్షణ దుస్తుల లేమి, విదేశాల నుంచి వచ్చిన వారి ట్రాకింగ్‌ లేకపోవడం వంటివి కూడా సమస్యలుగా ఉన్నాయని వెల్లడైంది. ఈ సర్వేలో 410 జిల్లాల్లో పనిచేస్తున్న 2014-18 మధ్య బ్యాచ్‌లకు చెందిన యువ ఐఏఎ్‌సలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-03T09:26:47+05:30 IST