ఏప్రిల్ ఒకటి నుండి ఆ ఐఎఫ్‌ఎస్ కోడ్స్ మారుతున్నాయి... కొత్తవి ఇలా తెలుసుకోవచ్చు...

ABN , First Publish Date - 2021-03-09T01:25:52+05:30 IST

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లో విలీనమైన నేపధ్యంలో... ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు శాఖల ఐఎఫ్‌ఎస్ కోడ్స్ మారుతున్నాయి. ఏప్రిల్ ఒకటి నుండి ఇ-ఆంధ్ర, ఇ-కార్పొరేషన్ బ్యాంకు బ్రాంచీల కోడ్స్ మారుతున్నాయి.

ఏప్రిల్ ఒకటి నుండి ఆ ఐఎఫ్‌ఎస్ కోడ్స్ మారుతున్నాయి... కొత్తవి ఇలా తెలుసుకోవచ్చు...

ముంబై : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)లో విలీనమైన నేపధ్యంలో... ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు శాఖల ఐఎఫ్‌ఎస్ కోడ్స్ మారుతున్నాయి. ఏప్రిల్ ఒకటి నుండి ఇ-ఆంధ్ర, ఇ-కార్పొరేషన్ బ్యాంకు బ్రాంచీల కోడ్స్ మారుతున్నాయి. కొత్త ఐఎఫ్‌ఎస్ కోడ్‌లు అమల్లోకి వస్తాయని యూబీఐ తెలిపింది. ఈ రెండు బ్యాంకుల కోడ్స్ యూబీఐఎన్ 08, 09తో మొదలయ్యేలా మార్చుతున్నాయి. ఆంధ్రా బ్యాంకు ఐఎఫ్‌ఎస్ కోడ్‌ను యూబీఐఎన్‌ఓ8తో, కార్పోరేషన్ బ్యాంకు శాఖల కొత్త ఐఎఫ్‌ఎస్ కోడ్‌ను యూబీఐఎన్‌ఓ9 తో ప్రారంభమవుతాయి.


ఇక... ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకుల చెక్కులు వచ్చే నెల ఒకటవ తేదీ తర్వాత పని చేయవు. వాటి స్థానంలో కొత్త ఐఎఫ్‌ఎస్ కోడ్, ఎంఐసీఆర్ నంబరు ఉన్న యూబీఐ చెక్కుబుక్కును తీసుకోవాలి. అదే సమయంలో ఆంధ్రా బ్యాంకు, కార్పోరేషన్ బ్యాంకు ఖాతాదారుల ఖాతా నెంబర్లు మారడం లేదు. బ్యాంకుల విలీనం నేపధ్యంలో తమ బ్యాంకుల అకౌంట్, ఇతర విషయాల గురించి ఏమైనా వివరాలు కావాలంటే తమ తమ బ్యాంకుల శాఖల్లో తెలుసుకోవచ్చు.

Updated Date - 2021-03-09T01:25:52+05:30 IST