తూనికలు, కొలతలశాఖ తనిఖీలు

ABN , First Publish Date - 2021-05-13T05:50:41+05:30 IST

నగరంలోని మెడికల్‌ షాపుల్లో తూనికలు, కొలతలశాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు.

తూనికలు, కొలతలశాఖ తనిఖీలు

కర్నూలు(న్యూసిటీ), మే 12: నగరంలోని మెడికల్‌ షాపుల్లో తూనికలు, కొలతలశాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా రెండు మెడికల్‌ షాపులపై కేసులు నమోదు చేసి, రూ.3 వేల అపరాధ రుసుం విధించారు. మాస్కులపై డిక్లరేషన్‌ లేకపోవడంతో కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ పరమేశ్వరకుమార్‌ తెలిపారు. మెడికల్‌ షాపుల్లో ఎమ్మార్పీకే మందులను విక్రయించాలన్నారు.

Updated Date - 2021-05-13T05:50:41+05:30 IST