ముంబై: అధికారంలోకి రావాలనుకుంటే రావాలని, అంతే కానీ దుర్మార్గాలకు పాల్పడొద్దని భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే శుక్రవారం విమర్శలు గుప్పించారు. తాజాగా ఉద్ధవ్ బావమరిదిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి 6.45 కోట్ల రూపాయలను ఆస్తులను జప్తు చేసింది. ఇది జరిగిన రెండు రోజుల అనంతరం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ తనను జైల్లో పెట్టాలనేదే బీజేపీ లక్ష్యమైతే పెట్టండంటూ సవాలు విసిరారు.
ఇవి కూడా చదవండి
‘‘ఇదంతా (ఈడీ దాడులు) అధికారం కోసమేగా.. అధికారంలోకి రావాలనుకుంటే రండి. కానీ ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాను. మేము మీ (బీజేపీ) కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అలా అని మీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఎలాంటి తప్పులూ చేయలేదని కాదు. కానీ, ఎవరి కుటుంబ సభ్యులపైనా వేధింపులకు దిగొద్దు’’ అని ఉద్ధవ్ భావోద్వేగంగా ప్రసంగించారు.
ఇవి కూడా చదవండి
ఉద్ధవ్ భార్య రేష్మా సోదరుడు అనిల్ పరభ్ సహా ఉద్ధవ్ కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరేలపై ఈడీ కొద్ది రోజులుగా రైడ్లు చేస్తోంది. వీరే కాకుండా పార్టీలోని కీలక నేతల సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ రైడ్లు చేస్తోంది. అయితే ఇదంతా తమపై అక్కసుతో ఉద్దేశపూర్వకంగా జరుగుతోందని.. బీజేపీని మహారాష్ట్రలో అధికారంలోకి రాకుండా నిలువరించినందుకే తమపై ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నారని శివసేన ఆరోపిస్తోంది.
ఇవి కూడా చదవండి