బ్యాటరీ లైఫ్‌ పెరగాలంటే...

ABN , First Publish Date - 2021-04-10T06:06:06+05:30 IST

సెల్‌ఫోన్‌లో కీలకమైన కాంపోనెంట్‌ బ్యాటరీ. ఎక్కువగా దుర్వినియోగమయ్యేది కూడా అదే. ఫోన్‌ కొన్న కొత్తలో చార్జింగ్‌ బాగానే ఉంటుంది

బ్యాటరీ లైఫ్‌ పెరగాలంటే...

సెల్‌ఫోన్‌లో కీలకమైన కాంపోనెంట్‌ బ్యాటరీ. ఎక్కువగా  దుర్వినియోగమయ్యేది కూడా అదే. ఫోన్‌ కొన్న కొత్తలో చార్జింగ్‌ బాగానే ఉంటుంది. ఆరు నెలల తరవాత నుంచీ ట్రబుల్‌ ఆరంభమవుతుంది. బ్యాటరీ హెల్త్‌ క్షీణిస్తూ ఉంటుంది. నిజానికి బ్యాటరీ డౌన్‌ అవ్వడమనేది మన వినియోగాన్ని అనుసరించి ఉంటుంది. చార్జ్‌ చేసే విధానం నుంచీ ప్రతీదీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 

అవేంటో చూద్దాం.


జీరో శాతానికి రానీయోద్దు

ఫోన్‌లోని బ్యాటరీ పూర్తిగా క్షీణించడం అంటే జీరోకి వచ్చేవరకు ఆగవద్దు. చార్జ్‌ స్థాయి ఎన్నడూ ఇరవై శాతానికి తగ్గకుండా చూసుకోవాలి. పూర్తిగా డౌన్‌ అయ్యేవరకు ఉపయోగించుకుని, తదుపరి మాత్రమే చార్జింగ్‌ పెట్టుకోవడం మంచిపని కాదు. 


రాత్రంతా చార్జింగ్‌ వద్దు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్‌లు అన్నింటిలో సాధారణంగా 90 నిమిషాల్లో అంటే గంటన్నర సేపటిలో ఫుల్‌గా చార్జ్‌ అయ్యేలా డిజైన్‌ చేశారు. అందువల్ల రాత్రంతా చార్జింగ్‌లో ఉంచడం ఏమంత మంచి పద్ధతి కానేకాదు. ఓవర్‌ చార్జింగ్‌తో బ్యాటరీ ఉనికే దెబ్బతింటుంది. 


ప్రతిసారీ వందశాతం వద్దు

బ్యాటరీ ఆరోగ్యం బాగుండాలంటే వంద శాతం చార్జింగ్‌ కోసం యత్నించవద్దు. 90 శాతం దాటి చార్జింగ్‌ కాగానే తీసివేయడం బెటర్‌.  ఓవర్‌ చార్జింగ్‌ను నివారించడమే కాదు, బ్యాటరీ కండిషన్‌ కూడా దెబ్బతినదు. 


తక్కువ వాట్‌తో చార్జింగ్‌ మేలు

సాధారణంగా అందరూ ఫాస్ట్‌ చార్జింగ్‌ చేయాలనుకుంటుంటారు. అయితే దానివల్ల బాటరీ దెబ్బతింటుందట. ప్రామాణికమైన 5 వాట్‌ అడాప్టర్‌తో నింపాదిగా చార్జింగ్‌కే ప్రాధాన్యం ఇవ్వండి. లాంగ్‌ రన్‌లో ప్రయోజనం బాగా ఉంటుంది. 


పవర్‌ సేవింగ్‌ మోడ్‌

గేమ్స్‌ ఏవీ ఆడనప్పుడు పవర్‌ సేవింగ్‌ మోడ్‌ ఉత్తమం. అనేకానేక పనులు ఒకేసారి చేస్తుండటం అంటే మల్టీ టాస్కింగ్‌ లేనప్పుడు కూడా ఇదే వర్తిస్తుంది. అలాగే ఎల్లవేళలా అన్ని సిలిండర్లపై ఫోన్‌ను రన్‌ చేయించటం కూడా మంచి పద్ధతి కాదు. 


వైఫై, బ్లూటూత్‌ వద్దు

వైఫై, బ్లూటూత్‌...రెండూ బ్యాటరీ లైఫ్‌ని తినేస్తాయి. అవసరం లేదని అనుకున్నప్పుడు ఆ రెంటినీ కట్‌ చేసి ఉంచడమే బెటర్‌.


వైర్‌లెస్‌ రివర్స్‌ చార్జింగ్‌ వద్దు

వైర్‌లెస్‌ రివర్స్‌ చార్జింగ్‌ సౌకర్యంగా ఉన్నప్పటికీ అస్తమానూ ఉపయోగించవద్దు. నిజంగా అవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఉపయోగించండి. లేకుంటే బ్యాటరీ లైఫ్‌ని దెబ్బతీస్తుంది. 


అనాథరైజ్డ్‌ చార్జర్లతో వద్దు

ఆథరైజేషన్‌ లేని, కేబుల్‌తో చార్జింగ్‌ వద్దు. బ్యాటరీని అవి వేడెక్కిస్తాయి. పద్ధతీ ఏదీ లేకుండా, ఒక సరైన స్థాయిలో లేని చార్జింగ్‌తోనూ బ్యాటరీకి ముప్పు కలుగుతుంది. 


నాణ్యత లేని పవర్‌ బ్యాంక్‌లు వద్దు

పవర్‌ బ్యాంక్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వాటి రేటింగ్‌, బ్రాండ్‌ గమనించండి. నాణ్యత లేని పవర్‌బ్యాంక్‌లతో నష్టమే తప్ప బ్యాటరీకి ప్రయోజనం ఉండదు. 


ఉపయోగించని యాప్‌లు తొలగించండి

ఉపయోగించని యాప్‌లను తొలగిస్తే, బ్యాటరీ లైఫ్‌ పెరుగుతుంది. వాటిని తొలగించిన తరవాత బ్యాక్‌గ్రౌండ్‌ యాప్‌ను టర్నాఫ్‌ చేయండి. సెట్టింగ్‌ మెనూలోకి వెళ్ళి రిఫ్రెష్‌ చేయండి. అలా మీరూ తరచూ ఉపయోగించని యాప్‌లను వదిలించుకోండి. 

Updated Date - 2021-04-10T06:06:06+05:30 IST