ఫేస్‌ప్యాక్‌ ఫలితం పొందాలంటే...

ABN , First Publish Date - 2020-09-16T04:55:16+05:30 IST

చర్మ సంరక్షణలో మాకు ఏ చిట్కా, ఉత్పత్తులు పనిచేయలేదని చాలామంది అంటుంటారు. అయితే ఫేస్‌మాస్క్‌ లేదా ఫేస్‌ప్యాక్‌ వేసుకున్నప్పుడు తొందరగా తొలగించడం,

ఫేస్‌ప్యాక్‌ ఫలితం పొందాలంటే...

చర్మ సంరక్షణలో మాకు ఏ చిట్కా, ఉత్పత్తులు పనిచేయలేదని చాలామంది అంటుంటారు. అయితే ఫేస్‌మాస్క్‌ లేదా ఫేస్‌ప్యాక్‌ వేసుకున్నప్పుడు తొందరగా తొలగించడం, రకరకాల ఉత్పత్తులు ప్రయత్నించడం వంటి పొరపాట్ల వల్లే అలా జరుగుతుంది. ఇంటి వద్ద తయారుచేసుకున్న ఫేస్‌మాస్క్‌ లేదా ఫేస్‌ప్యాక్‌ వేసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అప్పుడే మెరుగైన ఫలితం వస్తుంది.  


 ఫేస్‌మాస్క్‌ వేసుకునే ముందు తప్పనిసరిగా ముఖం కడుక్కోవాలి. ఇందుకోసం తేలికైన ఫేస్‌వాష్‌ ఉపయోగించాలి. దాంతో చర్మరంధ్రాలు తెరచుకుంటాయి. ఇప్పుడు ఫేస్‌మాస్క్‌ వేసుకుంటే చర్మం పూర్తిగా గ్రహిస్తుంది. ఫలితం వెంటనే కనిపిస్తుంది. ఒకవేళ మురికి, మలినాలు ఉన్న ముఖం మీద ఫేస్‌ప్యాక్‌ అప్లై చేస్తే అది పైపైనే ఉండి, చర్మానికి హాని చేస్తుంది.


 ఫేస్‌ప్యాక్‌ వేసుకోవడానికి అవసరమైన బ్రష్‌, టిష్యూ పేపర్స్‌, కాటన్‌ బాల్స్‌ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలి. అలానే కురులు ముఖం మీద వాలకుండా జుట్టుకు హెయిర్‌ బ్యాండ్‌ వేసుకోవాలి. లేదా పోనీటెయిల్‌ వేసుకున్నా సరే. దీంతో ప్యాక్‌ చెదరకుండా ఉంటుంది.


 ముఖాన్ని తాకేముందు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా, క్రిములు ముఖంపై చేరి మొటిమలు ఏర్పడతాయి. అందుచేత చేతులతో కాకుండా శుభ్రమైన బ్రష్‌ సాయంతో ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. 


 మెరుగైన ఫలితం రావాలంటే ఫేస్‌ప్యాక్‌ పూర్తిగా ఆరకముందే తొలగించవద్దు. ఫేస్‌ప్యాక్‌లోని పదార్థాలను చర్మం గ్రహించి, వాటి ప్రభావం చూపేంత వరకూ వేచి చూడడం స్కిన్‌కేర్‌లో చాలా ముఖ్యం.


Updated Date - 2020-09-16T04:55:16+05:30 IST