వంట తొందరగా అవ్వాలంటే...

ABN , First Publish Date - 2020-08-29T05:30:00+05:30 IST

ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తొందరగా వంట పని పూర్తి చేసి, బయట పడాలనుకుంటాం. కానీ ఎంత అనుకున్నా వంట అయ్యే సరికి..

వంట తొందరగా అవ్వాలంటే...

ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు తొందరగా వంట పని పూర్తి చేసి, బయట పడాలనుకుంటాం. కానీ ఎంత అనుకున్నా వంట అయ్యే సరికి ఎక్కువ సమయం అవుతుంది. అయితే కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే తొందరగా వంట చేసేయొచ్చు. అవేమిటంటే... 


 గ్రేవీ కూర వండేటప్పుడు నీళ్లు పోస్తుంటాం. నీళ్లు మరిగి కర్రీ అయ్యేసరికి కొంత సమయం పడుతుంది. అలాకాకుండా ముందుగానే వేడిచేసి పెట్టుకున్న నీళ్లను పోస్తే కూర తొందరగా అవుతుంది.

 వెడల్పాటి పాన్‌ బదులు చిన్న పాన్‌ తీసుకోవాలి. ఎందుకంటే వెడల్పాటి పాన్‌ వేడెక్కడానికి సమయం పడుతుంది. అదే చిన్న పాన్‌ మీద అయితే మంట ఎక్కువగా తగిలి వంట తక్కువ సమయంలో పూర్తవుతుంది.

 కూరగాయలను పెద్ద ముక్కలుగా కోయడం వల్ల అవి ఉడికేందుకు సమయం పడుతుంది. దాంతో కూర తొందరగా అవదు. అదే కూరగాయలను చిన్న ముక్కలుగా కోస్తే, అవి తొందరగా ఉడుకుతాయి. 

 ఫ్రిజ్‌లో ఉంచిన కూరగాయలు, పనీర్‌ వంటివి వంటకు ముందు బయటకు తీస్తాం. కానీ వండే కొద్దిసేపు ముందే వాటిని బయటకు తీస్తే వాటి చల్లదనం తగ్గుతుంది. ఆలోపు టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సిద్ధం చేసుకోవచ్చు. ఇలా చేస్తే వంటకు తక్కువ సమయం పడుతుంది. 

 వంట చేయడానికి ముందే ఓవెన్‌ను ఆన్‌ చేసి టెంపరేచర్‌ సెట్‌ చేసుకోవాలి. తరువాత ఓవెన్‌లో బేకింగ్‌ లేదా రోస్టింగ్‌ చేయాల్సిన పదార్థాలను సిద్ధంగా ఉంచుకోవాలి. దీంతో తక్కువ సమయంలోనే బేకింగ్‌, రోస్టింగ్‌ పూర్తవుతుంది.


Updated Date - 2020-08-29T05:30:00+05:30 IST