Bank Account: అవసరం లేని బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేసేటప్పుడు.. ఈ 4 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు..!

ABN , First Publish Date - 2022-09-25T18:17:14+05:30 IST

డబ్బులు బాగా ఉన్న వాళ్లకు మాత్రమే ఒకప్పుడు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసేవారు. తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో భద్రపరుచుకోవడంతోపాటు అదనంగా వడ్డీగా కూడా పొందేవారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. సేవింగ్స్ అకౌంట్లు అనేవి ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యాయి. ప్రభుత్వ పథకాల కోసం సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్ చేస్తు

Bank Account: అవసరం లేని బ్యాంక్ అకౌంట్లను క్లోజ్ చేసేటప్పుడు.. ఈ 4 మిస్టేక్స్ అస్సలు చేయొద్దు..!

ఇంటర్నెట్ డెస్క్: డబ్బులు బాగా ఉన్న వాళ్లకు మాత్రమే ఒకప్పుడు బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేసేవారు. తమ వద్ద ఉన్న నగదును బ్యాంకుల్లో భద్రపరుచుకోవడంతోపాటు అదనంగా వడ్డీగా కూడా పొందేవారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. సేవింగ్స్ అకౌంట్లు అనేవి ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయ్యాయి. ప్రభుత్వ పథకాల కోసం సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్ చేస్తున్నారు. కొందరు తమ అవసరాన్ని బట్టి.. వేరు వేరు బ్యాంకుల్లో ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్లను తెరుస్తున్నారు. కాగా.. ఇటువంటి వారికి ఉపయోగపడే సమాచారాన్నే ఈ వార్త రూపంలో మీరు తెలుసుకోబోతున్నారు. 


ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లు ఉండటం తప్పేమీ కాదు. అయితే.. ఎక్కువ అకౌంట్లతో పని లేదనుకున్నప్పుడు ముందూ వెనకా ఆలోచించకుండా అవసరం లేని అకౌంట్లను క్లోజ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. అలా ఇబ్బందులు ఎదురుకాకూడదూ అంటే.. కింది సూచనలు తప్పనిసరిగా పాటించాల్సిందే.


ముందుగానే స్టేట్‌మెంట్ తీసుకోండి

సేవింగ్స్ అకౌంట్‌ను క్లోజ్ చేయడానికి ముందే.. ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను పూర్తిగా డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని కంప్యూటర్‌లో భద్రపరుచుకుంటే.. భవిష్యత్తులో అకస్మాత్తుగా వచ్చే అవసరాలకు ఇబ్బంది పడకుండా ఉండొచ్చు.



ఆటోమేటెడ్ పేమెంట్లను నిలిపివేయండి

లోన్లకు సంబంధించిన డబ్బులు చాలా మంది ఈఎంఐల రూపంలో చెల్లిస్తూ ఉంటారు. ఇందుకోసం ఆటోమేటెడ్ పేమెంట్ల ఆప్షన్‌ను టర్న్ ఆన్ చేసుకుని.. ఫైన్‌ల భారం పడకుండా ఈఎంఐ డబ్బులు కట్ అయ్యేలా చూసుకుంటారు. అయితే.. సేవింగ్స్ అకౌంట్లను క్లోజ్ చేసే ముందు తప్పనిసరిగా ఆటోమేటెడ్ పేమెంట్లను నిలిపి వేయాలి. ఆ తర్వాత ఈఎంఐ డబ్బులు మరొక సేవింగ్స్ అకౌంట్ నుంచి కట్ అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా చేయకపోతే.. లేట్ పేమెంట్ కింద మీరు ఫైన్‌లు కట్టాల్సి వస్తుంది. 


అకౌంట్ సమాచారాన్ని అప్డేట్ చేయాలి

ప్రభుత్వ పథకాలతో ముడిపడి ఉన్న సేవింగ్స్ అకౌంట్లను క్లోజ్ చేసే ముందు.. తప్పనిసరిగా కొత్త అకౌంట్ వివరాలను అప్‌డేట్ చేయాలి. లేదంటే.. ప్రభుత్వం అందే సాయం కోల్పోయే ప్రమాదం ఉంది. 


క్లోజింగ్ ఛార్జీల నుంచి తప్పించుకోండి

కొన్ని బ్యాంకులు ఎప్పుడు అకౌంట్లను క్లోజ్ చేసినా కస్టమర్ల నుంచి క్లోజింగ్ ఛార్జీలను వసూలు చేస్తాయి. మరికొన్నేమో.. పరిమిత కాలం గడువు ఇచ్చి.. గడువు దాటిన తర్వాత అకౌంట్లు క్లోజ్ చేసే వారి నుంచి క్లోజింగ్ ఛార్జీలు వసూలు చేస్తాయి. మీకు సంబంధించిన సేవింగ్స్ అకౌంట్లకు ఇటువంటి షరతులు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుని.. గడువుకు ముందే అకౌంట్లను క్లోజ్ చేసుకుంటే.. డబ్బులు నష్టపోకుండా ఉంటారు. 


Updated Date - 2022-09-25T18:17:14+05:30 IST