బంగ్లాదేశ్ జట్టుకు ధోనీని కెప్టెన్‌గా చేసినా సరే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-02-19T02:45:22+05:30 IST

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ పేలవ ప్రదర్శనపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్

బంగ్లాదేశ్ జట్టుకు ధోనీని కెప్టెన్‌గా చేసినా సరే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

లాహోర్: పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ పేలవ ప్రదర్శనపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ జాతీయ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం ఈ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లోనూ ఓడిన కరాచీ కింగ్స్ చివరి రెండు మ్యాచుల్లోనైనా గెలిచి కాస్తంత గౌరవంగా టోర్నీ నుంచి నిష్క్రమించాలని భావిస్తోంది. పాక్ జట్టుకు కెప్టెన్‌గా అద్భుత విజయాలు అందించిన బాబర్.. పీఎస్‌ఎల్‌లో తాను సారథ్యం వహిస్తున్నట్టు జట్టుకు ఒక్క విజయం కూడా అందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి.


బాబర్‌పై వెల్లువెత్తుతున్న విమర్శలపై సల్మాన్ భట్ స్పందించాడు. అతడికి మద్దతుగా నిలిచాడు. కరాచీ కింగ్స్ జట్టుకు కెప్టెన్‌ను మార్చాల్సి ఉంటుందని తాను భావించడం లేదని అన్నాడు. బంగ్లాదేశ్ జట్టుకు ధోనీని కెప్టెన్‌గా చేసినా సరే ఆ జట్టు ప్రపంచ చాంపియన్ కాలేదని, కరాచీ కింగ్స్ జట్టు పరిస్థితి కూడా అలాగే ఉందని పేర్కొన్నాడు.


కాబట్టి కెప్టెన్ మార్పు అనేది ఈ సమస్యకు పరిష్కారం అని తాను భావించడం లేదని పేర్కొన్నాడు. కాబట్టి కొంత సహనం అవసరమని అన్నాడు. మనం ఎంత గొప్ప వ్యూహకర్తలమైనా జట్టులో స్పెషలిస్టులు లేకపోతే ఏ జట్టు  పరిస్థితి అయినా ఇలానే ఉంటుందని భట్ పేర్కొన్నాడు. 

Updated Date - 2022-02-19T02:45:22+05:30 IST