Abn logo
Apr 16 2021 @ 00:00AM

ఈ డాల్స్‌ను చూస్తే..!

అతని చేతిలో తయారైన డాల్స్‌ను చూస్తే ఒక్క క్షణం పాటు నిజమైన అమ్మాయిలే అని భ్రమపడాల్సిందే! ఉక్రెయిన్‌కు చెందిన అనస్తాసియా అనే ఆర్టిస్టు ప్రతిభను చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. 


అనస్తాసియా డాల్స్‌ తయారీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రతీదీ పర్‌ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. చర్మం రంగు, చేతి వేళ్లు, గోళ్లు, కళ్లు, పెదాలు... ప్రతి అంశంలోనూ పర్‌ఫెక్ట్‌నెస్‌ కోసం ప్రయత్నిస్తాడు. అందుకే అతని బొమ్మలకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. 



తను తయారుచేసిన డాల్స్‌ను ఆన్‌లైన్‌లో విక్రయిస్తుంటాడు. ఇన్‌స్టా అకౌంట్‌లో డాల్స్‌ను పెట్టిన మరుక్షణమే ఆర్డర్లు వెల్లువలా వచ్చిపడుతుంటాయి. అనస్తాసియా చేతిలో తయారైన డాల్స్‌ను ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.


Advertisement
Advertisement
Advertisement