Agnipath పథకం నచ్చకపోతే సాయుధ దళాల్లో చేరవద్దు...నిరసనకారులను నిందించిన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్

ABN , First Publish Date - 2022-06-20T13:11:48+05:30 IST

కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్( Agnipath) నిరసనకారులపై విరుచుకుపడ్డారు....

Agnipath పథకం నచ్చకపోతే సాయుధ దళాల్లో చేరవద్దు...నిరసనకారులను నిందించిన మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్

న్యూఢిల్లీ:  కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్( Agnipath) నిరసనకారులపై విరుచుకుపడ్డారు. మంత్రి వీకే సింగ్ ఆదివారం ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నిరసనకారులను నిందించారు.సాయుధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం కొత్త విధానం అగ్నిపథ్ పథకం నచ్చకపోతే యువకులు దానిని ఎంచుకోవద్దని మంత్రి కోరారు.కొత్త విధానం అగ్నిపథ్ నచ్చని వారు సాయుధ దళాల్లో చేరవద్దని సింగ్ కోరారు.మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి వీకే సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యం సైనికులుగా చేరమని బలవంతం చేయదని, ఔత్సాహికులు తమ ఇష్టానుసారం చేరవచ్చన్నారు.


‘‘అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్ నచ్చకపోతే, అందులో చేయవద్దు.మిమ్మల్ని ఎవరు చేరమని అడుగుతున్నారు? మీరు బస్సులు, రైళ్లను తగలబెడుతున్నారు. మిమ్మల్ని సాయుధ దళాల్లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారు. మీరు అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తేనే మిమ్మల్ని ఎంపిక చేస్తారు’’ అని వీకే సింగ్ చెప్పారు.1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు 'అగ్నిపథ్' పథకం ఆలోచన ఏర్పడిందని సింగ్ వివరించారు.


Updated Date - 2022-06-20T13:11:48+05:30 IST